ఈ పుట ఆమోదించబడ్డది

భించుట), కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటిని ఆపుజేసి కుంభించుటలను చేతురు. వీటినే పూర్ణకుంభకము, శూన్య కుంభకము, కేవలకుంభకము అందురు.

____

ప్రాణాయామము

(శంకరుని ప్రకారము)

"మనస్సువలె సమస్తమును బ్రహ్మమేయనియు, ఈ జగత్తు అంతయు శూన్యమే అనియు గుర్తించుట రూపముగ, సమస్త ప్రాణశక్తులను వశపరుచుకొనుటయే ప్రాణాయామము"

"బయటకు విడచుగాలి జగత్తుయొక్క అభావమును సూచించును. లోపలికి పీల్చుగాలి నేను బ్రహ్మను అను భావమును సూచించును.

"ఆ పిమ్మట చేయు శ్వాసావరోధము నేను బ్రహ్మను అను భావమును ధృవపరచును. బుద్ధిమంతుడగువాడు ప్రాణాయామమును యీ విధముగా తెలసికొనును. ఇటుల తెలిసి కొనని వాడు మూర్ఖుడు."

(అపరోక్షాను భూతి 118 - 120)

_____ _____

ప్రాణాయామము

(యోగి భుశుండుని ప్రకారము)

భుశుండుడను యోగి వశిష్ఠునకు యీరీతిని చెప్పెను:- పంచభూతములచే చేయబడిన యీదృశ్య శరీరములోగల హృదయ పద్మములో - ప్రాణము, అపానము అను రెండువాయు