ఈ పుట ఆమోదించబడ్డది

ఆరంభావస్థ

ప్రణవము (ఓం) ను మూడు మాత్రల కాలమువరకు ఉచ్చరించుము. ఇది నీ పూర్వ పాపములను నాశమొనర్చును. మంత్రప్రణవము అన్ని ఆటంకములను, పాపములను పోద్రోల గలిగి యున్నది. ఇటుల అభ్యసించుటచే ఆరంభవస్థ సిద్ధించును. యోగియొక్క శరీరమునకు చెమటపట్టును. చెమటపట్టినపుడు ఆ చెమటను శరీరమునకు అంతటికి రుద్దవలెను. శరీరము తిమ్మిర్లెక్క వచ్చును, ఒక్కొకప్పుడు కప్పవలె ఎగరవచ్చును.

ఘటావస్థ

ఆ తరువాత స్థితి ఘటావస్థ. ఇది తరుచు కుంభకము చేయుటచే సిద్ధించును. ప్రాణము, అపానము, మనస్సు, బుద్ధి, జీవాత్మ పరమాత్మల ఏకత్వప్రాప్తి కలుగుటనే, ఘటావస్థ అందురు. అట్టి స్థితి ప్రాప్తించినవాడు, అభ్యాసము చేయుటకుగాను నిర్ణయింపబడిన కాలములో నాల్గవవంతుకాలము సేపుమాత్రము అభ్యాసముచేసిన చాలును. ఉదయము సాయింత్రము 3 గంటల సేపు మాత్రము చేసిన చాలును. కేవల కుంభకము, రోజుకు ఒకమారు చేసిన చాలును.

గాలిని ఆపుజేసి వుంచిన సమయమున, ఇంద్రియముల నన్నిటిని వాటి యొక్క విషయముల నుండి మరల్చుటను ప్రత్యాహారము అందురు. నీవు కంటితో చూచు ప్రతివస్తువును ఆత్మగా తలచుము. చెవితో విను ప్రతి దానిని, ముక్కుతో వాసనచూచు ప్రతి పదార్థమును, నోటితోరుచిచూచు ప్రతివస్తువును, చేతితో తాకు ప్రతిదానిని ఆత్మగా