ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణాయామ సమయంలో కుంభకమువల్లపుట్టెడి వేడి, కుండనీ శక్తిని లేపి సుషుమ్నా నాడిగుండా పైకి పోవులాగున చేయును. ఇట్టి సాధకునకు అనేకవిధములగు దృష్టులు కలుగును. ఈ రీతిని సాధనచేయుటవల్ల క్రమక్రమంగా కుండలినీశక్తి, పైకి పైకిపోయి ఆరుచక్రములను దాటి, చివరకు శివునితోఐక్యమగును. ఈ శివుడు తలయందలి సహస్రదళములుగల సహస్రారమను పద్మమునందుండును. ఈ రీతిని శక్తి, శివుల ఐక్యము గలుగుటచే నిర్వికల్ప సమాధి లభించుటయేగాక, సాధకుడు మోక్షమును పొంది, సమస్తములగు దైవీసంపదలను పొందును. ప్రతివాడు ఏకాగ్రతతో కూడియున్న మనస్సుతో ప్రాణాయామమును చేయవలెను. ఏలనన, మణిపూర చక్రము వరకు తీసికొని పోబడిన కుండలినీ శక్తి, ఏకాగ్రత తప్పినచో మరల మూలాధారమున పడిపోవచ్చును. ఈ కుండలినిని, మేల్కొలుప దలచినవాడు వైరాగ్యమును, వాంఛారాహిత్యమును చక్కగా అభ్యసించవలెను. కుండలిని దారమువలెవుండి దేదీప్యమానముగ ప్రకాశించుచుండును. అది మేల్కొనినప్పుడు, కర్రతో పామునుకొట్టినచో, ఏవిధముగా బుసకొట్టునో ఆ రీతిని బుసకొట్టుచూలేచి, సుషుమ్నా రంధ్రమున ప్రవేశించును. ఇది క్రమక్రమముగ ఒక చక్రము తరువాత మరొక చక్రములో ప్రవేశించుటవల్ల మనస్సుయొక్క పొరలు విడిపోయి, అనేక సిద్ధులు పొందును.

షట్చక్రములు *[1]

చక్రములు అన, ఆధ్యాత్మిక శక్తికేంద్రములు. అవి లింగ శరీరమునందు వున్నప్పటికీ, స్థూలశరీరముతో సంబంధ

  1. * పూర్తివివరములకు 'కుండలినీ యోగము' చూడుము.