ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధిపొందకుండా ఆగిపోవును. 'డీ' విటమిను పాలు, వెన్న, కోడిగ్రుడ్డు, కాడ్‌లివర్ ఆయిల్ మొదలగువాటిలో గలదు. 'డీ' విటమిను తక్కువైనచో పిల్లలకు అస్థిమార్దవ వ్యాధి వచ్చును.

ఆహార మన శరీరమునకు పుష్టి నిచ్చు పదార్థముల మొత్తము. ఆహారము శరీరము, మనస్సులకు బలమును నిచ్చును. నీ పరిశుద్ధమగు యిచ్ఛాశక్తిచే యోగవిధానమువల్ల సూర్యుని నుండి నేరుగా యీప్రాణపోషక పదార్థములను గైకొను మర్మమును తెలసికొన్నచో, ఆహారము లేకుండ ఎంతకాలమేని జీవించవచ్చును. ఇతడు కాయసిద్ధి పొందగలడు.

ఆహారము పూర్తిగా జీర్ణము కానిచో మలబద్ధము వచ్చును. ఆహారమున, కొంత పొట్టుపదార్థము వుండవలెను. ఇందుచే మలబద్ధమురాదు. జీర్ణక్రియ జరుగునప్పుడు నీటిని త్రాగరాదు. అందువలన జీర్ణరసము పలుచబడుటచే, సరిగా జీర్ణముకాదు. భోజనముకాగానే ఒక గ్లాసెడు నీరు త్రాగుము.

ముష్టెత్తుకొని మాత్రమే జీవించు సన్యాసులకు ప్రతి దినము ఒకేమాదిరి ఆహారము లభించదుగదా ! అట్టివారు తాము తినెడి ఆహారమును, తమ యోగశక్తిచే పవిత్రపరచుకొని, పుష్టికరమైనదానినిగ చేసికొందురు. ఇది సామాన్యులకు తెలియదు.

యోగసాధకులు ఉపవసించరాదు. అందుచే నీరసము వచ్చును. అప్పుడప్పుడు ఉపసించుట లాభకారియే. యోగ సాధకులు ఉదయం 11 గం. లకు కడుపునిండ ఆహారము పుచ్చుకొనవచ్చును. ఒక గ్లాసెడు పాలు ఉదయమునను, అర్థశేరు