ఈ పుట ఆమోదించబడ్డది

వులను చంపుట మహాపాపము. కొందరు దేవుళ్ళ పేరుచెప్పి జంతువులను బలియిచ్చెదరు. ఇది మూర్ఖత్వము.

"అహింసా పరమోధర్మ:" అహింసయే గొప్పధర్మమని చెప్పలేదా ? "దీనినే యేసుప్రభువు, "దయతో నుండువారు ప్రభునిచే దయతో చూడబడుదురు" అని చెప్పెను.

మహా వీర ప్రభువు "ప్రతి ప్రాణిని తన్నుగా తలచి, దేనికిని కీడును చేయకుము" అనెను. ఇతరులకు నీవుచేయు ప్రతి కీడు, నీకే తిరిగివచ్చును.

లేడీ మార్గరెట్ హాస్పిటలునందలి ప్రధానవైద్యుడగు డా. జే. ఓల్డుఫీల్డ్ యీ విధముగా వ్రాసెను.

"మానవునకు కావలసిన సమస్త ప్రాణపోషక పదార్థములు శాకములలో గలవని యీనాడు శాస్త్రపరిశోధనచే రుజువు అయ్యెను. మాంసము అస్వాభావికాహారము. అందు వల్ల అనేకములగు అపాయములు కలుగును. నేటి ఆధునిక నాగరకులు దీనిని నాగరకముగ ఎంచి, తిని, అనేకవ్యాధులకు గురియగుచున్నారు. నూటికి తొంబది తొమ్మిది వ్యాధులు మాంసాహారమువల్లనే వచ్చుచున్నవని చెప్పుటలో ఆశ్చర్యము ఏమియూ లేదనుటను ఎవ్వరును కాదనజాలరు."

మాంసాహారము, మద్యపానము యివి రెండును సోదరులవంటివి. మాంసాహారులు సంతాననిరోధము నొనర్పజాలరు, వీరికి మనస్సును వశపరచు కొనుట పూర్తిగా అసంభవము. మాంసమును తిను పులి ఎంతభీకరముగను, గడ్డినితిను ఆవు ఏనుగులు ఎంత ప్రశాంతముగను వుండునో చూడుము. మాంసము మెదడుపై చాల దుష్పలితమును కలిగించును.

ఆధ్యాత్మికోన్నతి కోరువాడు మొట్ట మొదట మాంసాహారమును మానివేయ వలెను. మాంసాహార దేశము అందలి