ఈ పుట ఆమోదించబడ్డది

కుము. చెప్పిన ప్రకారము సక్రమముగా చేయుచున్నచో, ఏ విధమగు బాధయు రాదు. నిస్సంశయముగ జయమును పొందెదవు. ప్రారంభములో ఏవో స్వల్ప దోషములు వుండవచ్చును. అవి క్రమక్రమముగ పోవును. కావున ప్రతి స్వల్పవిషయమునకు భయపడి సాధనను మానివేయకుము. సాధనను శ్రద్దాభక్తులతో వెంటనే ప్రారంభించుము. క్రమము తప్పకుండ చేయుచుండుము. తప్పక యోగివి కాగలవు.

ఓం శాంతి: శాంతి: శాంతి: శాంతి:

____* * * ____

అనుబంధము

సౌర నాడీమండలిపై ధారణ

సౌరనాడీ మండలి ఒక ప్రధానమైన నరముల కూటమి. ఇది పొట్టకు పైభాగముననుండు గుంటకు వెనుకవైపుగా వుండును. మనుష్యుని ఆంతరికావయములన్నిటి పైన ఈ నాడీ మండలి ఆధిపత్యమును కలిగియున్నది. మనుష్యుని ఆ వేగములు శారీరక కృత్యములను వశపరుచుకొనుటలో యిది ప్రధాన పాత్రను వహించి యున్నది. ఈ మండలి తెల్లని బూడిద వన్నెగా గల మజ్జాపదార్థముచే చేయబడి యున్నది. ఈనాడీ మండలిపై తీవ్రమగు దెబ్బతగిలినచో, మనుష్యుడు స్పృహ తప్పి పడిపోవును. ఇది ప్రాణముండుచోటు, శక్తినిలయము. అది పదునారు ఆధారములందు ప్రధానమైనది. ఇచ్చట తీవ్రమగు దెబ్బ తగులుటచే చచ్చిన మనుజు లెందరో గలరు. ఇది