ఈ పుట ఆమోదించబడ్డది

38. కొందరు రేచక, పూరక, కుంభకములను, మరి కొందరు పూరక కుంభక రేచకములను వరుసగా చేసెదరు. వీటిలో రెండవ విధమునే ఎక్కువమంది చేసెదరు.

యాజ్య్ఞవల్కుడు 'పూరక, కుంభక, రేచకములను' క్రమముగ చెప్పెను. నారదీయములో రేచక, పూరక, కుంభకములను క్రమముగా చెప్పెను. ఈ రెండింటిని ఇచ్ఛానుసారము అభ్యసించ వచ్చును.

39. యోగి యగువాడు భయము, కోపము, సోమరి తనము, అతి నిద్ర, అతి మెలకువ, అతి తిండి, అతి ఉపవాసములు లేకుండ వుండవలెను. పై నియమములను పాటించుచూ ప్రతినిత్యము సాధన చేయుచున్నచో ఆధ్యాత్మిక సామ్రాజ్యము నిస్సందేహముగ మూడు మాసములలో లభించగలదు. నాల్గు మాసములలో దేవతలను చూడగలడు. అయిదు మాసములలో బ్రహ్మనిష్ఠుడు కాగలడు. ఆరు మాసములలో తన ఇచ్ఛాను సారము కైవల్య ప్రాప్తిని పొందగలడు. ఇం దేవిధమగు సంశయము లేదు.

40. ప్రారంభకుడు పూరక రేచకములను మాత్రమే కొన్నాళ్ళు చేయవలెను. కుంభకము చేయరాదు. అట్టి స్థితి యందు పూరక రేచకముల నిష్పత్తి 1:2 లో వుండవలెను.

41. ప్రాణాయామమును కూర్చొని, నిలబడి లేక నడచుచూ లేక పడుకొని ఏరీతిగా చేసినప్పటికి ఫలితముల నివ్వ గలదు. చెప్పిన విధానము ప్రకారము చేసినచో ఫలితములు త్వరగా కనిపించును.

42. కుంభకకాలమును క్రమక్రమముగ వృద్ధిచేయుము. మొదటివారము 4 సెకండ్లు, రెండవవారము 8 సెకండ్లు,