పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

మునకు సరిగా నాతఁ డు మూత్రోత్సర్గమునకుఁ బోయి వెనుక బడెను. బండిచక్ర మొకటి బండి గాడిపల్ల పుజాలులో నుండఁ గా మఱొక చక్రము గట్టుమిఁ ది కెక్కెను. ఉపక్రమమున నా యెగుడుదిగుడు కొంచెముగానే యుండెను. కాని రెండు మూఁ డు గజములు సాగునప్పటి కొడ్డగెడవుగా నయ్యెను. ఎడ్లు వడిగా దిగిపోవుచుండెను. బండి కడయంచున నేను గూర్చుంటిని. ఇఁ క నొక క్షణములో నా జీవిత మటో యిటో ఏదో ఆగుదశ దాపు రించినది సుమా యనుకొనుట నే నెఱుఁగుదును. ఈ యెఱుక బండితుదిపట్టున నుండి యెడ్లదిగుడు దూకుడును, చక్రముల యొడ్డగెడవును - వెలుపలికి చూడ్కి పాఱుచున్నది గాన- నేను గుర్తించితిని గాని బండి లోతట్టున గూడులో నొదిగి యున్న యాయిర్వురు నంతగా గిర్తింప రయిరి. ఇహలోక ప్రజ్ఞ యీ శరీరమున నుండుటో, ఊడుటో - ఈ లోకముతో సంబంధము తీరనున్న దేమో అన్న తలఁపు నాలో కలిగినక్షణమే యెఱుఁ గుదును గాని తర్వాత నన్నెఱుఁ గను. నా యునికి నెఱుఁ గను.

ఈ స్థితిలో కొన్ని క్షణములో నిమిషము లొకటి రెండో కడచి యుండఁ బోలును!' చండాలుడా ! లక్షరూపాయల విలువ చేసే మనిషిని చంపి వేస్తివిరా! చండాలుడా!' అన్న యవధాను కుగారి యేడ్పుటఱపుతో ప్రజ్ఞగాంచితిని.' బ్రతికిఉన్నానండీబాబూ! యేడ్వకండీ' అంటిని. అప్పావ ధానులుగారు నాయెదుట నిరపాయముగా నిలిచియుండిరి. నా కైహికప్రజ్ఞ కలిగినందుకు, అప్పావధానులు