పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/91

ఈ పుట ఆమోదించబడ్డది

తమ్మ గారు విసనకఱతో విసరుచు చెమట రోఁత దొలగించుచు హాయి గూర్చు చుండిరి. భోజన సమయమున మరల వారు నాకధ నుపక్రమించిరి.' ఇంటికి రాకుండ మద్రాసులోనే ఉండుమంటిని గాదా! నీ ఉప్పుడేల రావలెను? పెండ్లి ప్రయత్న మేమేని సాగెనా? పలుతూరులు నిన్ను పెండ్లాడ నాత్రపడవలదంటిని కదా? యూరపులో ననేకులు ఫ్రౌఢ వయస్సు వచ్చి విద్యాధనార్జనము చేసి యటు పై పెండ్లాడుట, కొందఱు పెండ్లాడకే తమ విద్యాధనములను లిక సేవ కై వినియోగించుట జరుగుచుండు నంటిని గదా! బీదఱికములో నలగుల పడుచు నొక పడుచును బెండ్లాడి యామెను గూడ దారిద్ర్యక్షోభమున పాల్పఱచుట కా పెండ్లాడుట? విద్యా విశేషములను, ధనము సేకరింప గల్గినచో, సౌకర్య మున్నచో నటు తర్వాత పెండ్లాడిన నాడ దగును గాని యిప్పుడేమి పెండ్లి? విద్యా వివేకములు లేనియాడుపడుచులనుబెండ్లాడిఏడాదికి, రెండేం డ్లకు బిడ్డను పుట్టుచుండుట,ఈదురో దేవుడా అనుచున్నట్టు చాలినంతగా లేక పోగా చాలీచాలని జీవితాయతితో నిరుత్సాహనిహతములై బాధపడుచున్న కుటుంబముల నెన్నింటిని జూచుట లేదు? అందులో నీవును జేరి దిగనాసిల్ల నభిలషింతువా?అని ఇంక నిత్యాదివిధముల తీవ్రభాషతో వారు నన్ను మందలింపసాగిరి.నేను దల వాల్చుకొని తినుచున్న యన్నపు ముద్ద మ్రింగుడు పడక మాటాడ