పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

౧౦

బ్రహ్మచర్యము - గార్హస్థ్యము

రెండేండ్లు కెలెట్ హైస్కూలులో నేను తెల్గు పండితుఁ డనుగా నుండఁ గా నాకు వివాహనిర్ణయము జరగి మా తలిదండ్రులు నన్నింటికి రమ్మనఁ గా నే నింటికి వెళ్లుచు బందరులో శ్రీ వల్లూరి సూర్యనారాయణరావు గారింట దిగితిని. అవి హైస్కులు వేసవి సెలవురోజులు. సూర్య నారాయణ రావుగారు మద్రాసు చేరునపుడు నన్ను దఱచుగా ఇంటికి వచ్చుచుండవల దనియు, మద్రాసులో ఓరియంటల్ లైబ్రరీలో గ్రంధములను విశ్రాంతి సమయములలో చదువుచు, వైదుష్యమును వృద్ధిపఱచుకొనుచు నుండ వలసిన దనియు, ఇప్పుడే వివాహము చేసికొని సంసారపు బాదర బందీలో పడవల దనియు. యూరపులో అనేకులు ఆజీవితము అవి వాహితులుగా నే ఉండి గొప్ప విజ్ఞానము గడించి, ధనము గడించి, ఆ ధనమును సంఘోపకారమునకై సమర్పింతురనియు, కొందఱేలోక సేవకై యవి వాహితులుగా నెలకొను టావశ్యక మనియు నాకు హెచ్చరికగా జెప్పుచుండుట కలదు.

అప్పుడు నా రాక వారి కతృప్తి గొల్పెను. చల్లని నూతి నీట నిర్వురము హాయిగా స్నానము చేసి భోజనము నకుఁ గూర్చుంటిమి. చెమటలు దిగజారుచున్నవి. సూర్య నారాయణ రావుగారి ధర్మపత్ని శ్రీ పార్వ