పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

స్నానము చేయ వలయుచుండును. ఈ కాకి పగ నన్నుఁ బది పండ్రెండేండ్లు బాధించినది. ఎఱిఁగి నే నేమియు నా కాకికి అపకృతి చేయ లేదు. దాని గూటికిని గూడ నెట్టికీడును జరుగ లేదు. కాని దానిపగ మాత్రము నాపై ప్రబలముగా భహువత్సర ములు సాగినది. మద్రాసు వచ్చిన తర్వాత నెలనెలకు నే నింటికిఁ బోవుటయుఁ దప్పెను. ఆ చింత చెట్టు నెండిపోయెను. ఆ కాకికూడ వేఱుచోటికిఁ జేరెనో! ఏమయ్యేనో! ఈ కధ నెందు కిక్కడ వ్రాసితి ననఁగా నిది నాకుఁ జాల వివేకము గఱపి బహుసమయములలో భావ విధిలో విహరించుచుండిన యధార్ధ గాధ!

ఇటీవల బసవపురాణాది గ్రంధముల ముద్రణ సందర్భములందు నాపై తీవ్రముగాఁ గోపము ప్రకటించి యిప్పటికిఁ బ్రకటించుచున్న వారియెడ నేను వర్తింపవలసిన తీరును కాకి పగ నాకు పాఠము చెప్పినది. ఎంత తీవ్రముగా విరోధించిన వారిపయిననను బ్రతివిరోధము పాటింపక, యంతరంగమున నాత్మీయత నే పాటించుచు నను రాగామునే సాగించుచుఁ దెలియఁ జెప్పఁ దగిన దానిని (కొందఱే అట్లు చెప్పఁదగినవా రగుదురు) సమ్ముఖములో సుదృఢముగానే తెలియఁ జెప్పుచు నుండునో నావిద్వేషము, వారికిఁ దెలియ కుండనే యంతరంగ