పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

శ్చైవ శక్రస్యాపి శ్రియం హరేత్' అని కలదు. ఇక్కడే కూర్చుంటి వేమి యనిరి. చూడలేదు అంటిని.' అది కాదు. శాస్త్రవిశ్వాసము లేదు' అనిరి. ఊరకుంటిని. వా రవతలికి వెళ్ళిన తర్వాత ' దుమ్ము మిఁదఁ బడుట రోతే! నేను పుస్తకముమీది దృష్టితో ఉండి గుర్తింపఁజాల నయితిని. గురువులవా రన్నట్టు నిజముగా నిట్టి శాస్త్రము మీద విశ్వాసము నాకు లేనట్టే ఉన్నది' అని యేదో ప్రక్కనున్న మిత్రునితో ననుచుంటిని. అది విని శాస్త్రులవారు నన్ను చీవాట్లు పెట్టిరి.


--- ---