పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

దొడ్డిలోనికి వెళ్ళి గోసికొని పోవుదు నంటిని.' తలుపులు తాళములు వేసినాము.వల్లగా'దనిరి - దొడ్డివైపున వెళ్ళి కోసి కొందు నంటిని. వల్ల గాదు పొమ్మని వారు వెళ్ళిపోయిరి. నేను దొడ్డివైపునకు వెళ్ళి చెట్టు కేసి చూచుచుంటిని. కొందఱు నన్ను జేర వచ్చిరి. కరివేపాకు కావలె నంటిని. ఎందుకు కనిరి? ఈ దేవతకు ద్వారమున కరివేపమండ కట్టవలె నట! అందుకు గావలెనంటిని. అంతే నాకొక మండ గోసి యిచ్చిరి. తర్వాత ఒకరొక రే ఒక్కొక్క మండ చొప్పున విఱుచుకొనిపోయి ద్వారతోరణముల కెక్కించిరి. చెట్టున ఒక ఆ కేని మిగుల లేదు. మరునాఁడింటి వారు వచ్చి ఆ దుండగము నేను చేసిన దని గుర్తించి నన్ను దండించినంత నిందించిరి. నే నబద్ధ మాదినందుకు ఫల మనుభవించితిని.

దైవముపేర సంఘమున అలజడి పుట్టించుట సుకరమనీ, అది దిద్దు టంత సుకరము గాదనీ. సంఘము విద్యా విజ్ఞానవంతమై మొత్తముమిఁద వర్దిల్లిననే గాని యిట్టి చేట్టలు దోలగింప సాధ్యముకాదనీ విన్నవించుటకే ఈ విషయముల నిక్కడ వ్రాసితిని. మతము, వైద్యము, జోస్యము, ధర్మము, ఆచారము ఇత్యాది సంప్రదాయ సంకేతములతో చెడుగు లేన్నెన్నో సంఘమున దిద్దఁ గుడురనివై మొద్దువారి కదల కున్నవి. వ్యాపించుచున్నవి. మూఢవిశ్వాసముతో వాని ననువర్తించులోక ముండ ట చేఁదత్ప్రు చారకులు వానిని స్వయము విశ్వసింపకపోయినను వాని వలని లాభముచే లోకముచే పలుకుబడి సాగించుకొను చున్నారు.