పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

మరణమును గూర్చి, మరణానంతర స్టితినిగూర్చి, పుట్టుకను గూర్చి పుట్టుకకు పూర్వ స్థితిని గూర్చి, దేవతలను గూర్చి నిరంతరం చింత నాకు రేగెను. పెద్దల నడుగాజాల నైతిని. తోడి వయసువారికి నా గోడు తెలుపుట వ్యర్ధమయ్యెను. వీని యాధార్ధ్యము తెలియవలె నని రాత్రులందు భగవంతునికి మ్రొక్కి కనులు మూసికొని చూడసాగగా చిమచిమ చిమ్మ చీకటి నన్ను చుట్టుముట్టి మహాసముద్రమువలె గోచరింప సాగాను. దాని మధ్య భాగమున నే నున్నట్టు తెలియును. అనంతముగా నన్ను చుట్టుముట్టి యున్నట్టి యా యంద కారము పొడుగుగా నున్నదా, చతురస్రముగా నున్నదా అని కూడ జూడ దొడగితిని. అది యేదో గోళాకారముగా నున్నట్టు తోచును. దాని నడుమ నేను ఉన్నాను, ఉన్నా నన్న ప్రజ్ఞ మాత్రము మినుకు మినుకు మనుచు గజిబిజి పాటుతో దోచుచుండెను. ఎన్ని రాత్రులో యిట్లు నిద్రపట్టు నంతదాక చూచుచునే యుంటిని. ఒకటే యంధకారము నే నున్నానన్న యెఱుక, మెలకువ మాత్రము ధైర్య చ్చాయను గొల్పసాగినది. అట్లు కనులు మూసికొని బైటను జుచుచున్నట్లు చూచుటే కాని యప్పుడు నా దేహములోనికి జూచుకోనుటకు యన్నది నే నెఱుగను? అట్లు చూడ లేదు. బైటి యంధకారగోళమున నుండి నా ప్రశ్నలకు సమాధానములు దొరకలేదు. నేను చచ్చిపోయితిని. తర్వాత! అనుకొనెడి వాడను. అప్పుడీ