పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

కొని పడి కొట్టక పూర్వమే సుఖముగా భోజనము చేసి, విశ్రాంతితో విద్యార్ధులకు పాఠములు చెప్పుటతో శ్రీ వారు సత్కాలక్షేపము జరుపుచుండిరి. పది గంటలలోగా భోజనము కానిచో వారి కొంటికణత తలనొప్పి వచ్చును. వా రతి సుకుమారశారీరులు. వారిని గూర్చి మా తండ్రిగారిని గూర్చి నాఁడుమా యూరి వా రిట్లు వాకొనుచుండు వారు. రామావధానులు గారికి తన కనారోగ్యము కలుగుట ఊరి కంతకు అనారోగ్యము కలుగుట- సుందరశాస్త్రిగారికి తన కుటుంబమున కనారోగ్యము కలుగుట యూరి కంతకు ననారోగ్యము కలుగుత-అని. తమ, తమ కుటుంబపు టనారోగ్యాములకు వీరు గజిబిజి పడునంతగా ఇతరుల యనారోగ్యముల గూర్చి వీరు గజిబిజి పడువారు కారనుట దీని తత్త్వము.

మా యింటి దగ్గఱ నే సాలెవీధిలో సాలెవారు వారి గురువగు భావనఋషికి ఉత్సవము జరుపుచుండరి. నా వయస్సప్పటికి ఎనిమిదో తొమ్మిదో ఉండును. సంజ వేళ 7, 8 గంటలప్పుడు భోజనము చేసి అక్కడ జరుగుచున్న యు త్సవమును జూచుట కేగి యట్టట్టే నేను మైమఱచి నెల వ్రాలి పోయితిని. అక్కడి వారు మైమరు పాటు కలుగుచుండుట నా వల్ల విని నన్నిం టికి గొని వచ్చిరి కాబోలును! ఎంత సేపయినదో! మా తండ్రిగారు దగ్గఱ శివకవచము పారాయణ చేయుచుండగా మెలకువ వచ్చెను. నా కేమియు బాధ గోచరింప లేదు. అంతే. అటుపై సాధారణముగా జాతర్లకు, దేవోత్సవములకు నే నంతగా వెళ్ళ నుత్సహింప కుండు టే జరుగుచు వచ్చినది. పై