పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

నయమగునట్లు అనుగ్రహింపుమని కరుణాసముద్రుఁ డ్తెనభగ వానుని వేడికొని, కనులు మూసికొని శరీరములో నేమి జరుగునో సాక్షిమాత్రముగ గమనింతురు. కొందరుఱికి వింత వింత సుందరతరదృశ్యములు కనుపడును. కొందరికి శరీరమున నొవ్వు గలభాగమూలం దేదియో కదలించినట్లును, సవరించి నట్లును తెలియనగును. కొందరు చీకుచింతలు మరచి హాయిగా నిద్ర జేందుదురు. ధ్యానానంతరము శరీర ముత్సాహముగాను, బాధావిహీనముగను ఉండును. కొన్ని పూట లిట్లు జరగినచొ క్రమస్దిరారోగ్యమేర్పడును. ఎప్పటికప్పుడు ధ్యాననమయమున జరగిన విశేషము లన్నియు రికార్డు చేయబడుచుండును.

ఒకప్పుడు ఒకరి యనారోగ్యకారణము మానసికము అయి యుండవచ్చును. అట్టియెడ నాకారణము నన్వేషించి యేరుకకుఁ దెచ్చుకొని దిద్దుకొన్ననేగాని ఆ యనారోగ్యము చక్కబడదు, శారీరకమ్తేనను, మానసికమ్తెనను అనారోగ్య స్వరూప మంతయు చికిత్సకునికి అవగాహన కానిదే చక్కబడదు. ఇందునుగూర్చిన అద్బుతమ్తెన విశేషము లెన్నియో చికిత్సాక్తె వచ్చిన వారురికార్డు చేసినవె చాల గ్రంథము కలదు
  దగ్గర కూర్చున్న వారికే శ్రీశాస్త్రిగారు సుదూరమున నున్న వారికిగూడ చికిత్స జరపుటయు , ఆశ్చర్యకరముగ వారారోగ్యము పొందుటయు గలదు. ఒకప్పుడు ప్రమాద సమయ మనితోచినపుడు ఇతరోపాయము అన్నియు కట్టుబడి