పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

ముగా నెంతురనియు, సాహిత్య కృషి యే వీడి రోగులకు ట్రీట్మెంటు చేయుటతో కాలము గడపెద రనియు వ్రాసిన దానిని బట్టి వారి సాన్నిధ్యమున నుండుట యన శుష్క వేదాంతములతో నీరసజీవనమును గడపుట యని తలపోయరాదు. ఆయన నిజముగా సత్యాన్వేషి! కళారాధకులు! ఉత్సాహజీవి! వారి ప్రతి పనియందును ఈ గుణములు కన్పించుచుండెడివి. రకరకముల రంగుపెన్సిళ్ళు, కలములు, చేతికఱ్ఱలు, వింత వింత వస్తువులు సేకరించుటయందు వారికి ప్రీతి యెక్కువ. ఈ పెన్సిళ్ళను సేకరించుటే వారి వంతు గాని వాడుకొనుట యందఱివంతు! ఇట్లే ఫౌంటెన్ పెన్నులు. దేనితో వ్రాసిన దస్తూరి సొంపుగా నుండునో యని చూచెడి వారు. చుట్టునున్నవారు తమ తమ పెన్నులతో పోటిపడెడు వారు. చిటికెనవ్రే లంతటి కొబ్బరికాయల నెచటి నుండియో తెప్పించి వానికి వెండి పొన్నులు, మూఁతలు చేయించి స్వయముగా మెఱుఁగు వెట్టి స్నేహితులకు బహూకరింతురు. ఇట్టిది నాకొకటి ఇచ్చిరి. నేను నశ్యము వాడనుగదా యని సందేహించితిని. నశ్యమునకైనచో వా రాపని చేయరు. ఆకాయలో దూదిపెట్టి అందు మంచి యత్తరు గాని యూడికొలాం గాని వేసి వాసన చూచుకొనవచ్చు నని వారు సలహానిచ్చిరి. ఇట్లే అనేకరకముల చేకర్రలను వారు స్వయముగా మెఱుగు పెట్టి స్నేహితుల కిచ్చెడువారు. తాటిచేవతో చేయబడి గుర్తింపరానివి, పామువలె ఏ డెనిమిది వంకరలు తిరిగినవి, పెద్ద పెద్ద వెండిపొన్నులతో మెఱయునవి యగు రకరకముల