పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వసాహిత్యమున భవభూతి మహాకవి యుత్తర రామచరిత్ర వీరిని పులకింపఁజేసెడిది. ఆనాటకమునకు వీరు చెప్పెడువ్యాఖ్య ప్రతిభాసమన్వితముగా నుండెడిది. శాకుంతల మన్న వీరి కభిరుచి తక్కువ. తుమ్మెద నెపముగా దంభము లాడుచు ప్రవేశించుదుష్యంతునిఁ జూచి వారు జుగుప్స పడెదరు! ఆ పాత్రకును నేఁటి రౌడీరసికునకు భేదము లే దని వారి యూహ. సాహిత్యమును గూర్చి వారికిఁ గల విశిష్టాభిప్రాయముల నన్నింటి నిట వ్రాయ ననువు గాదు. ఆ పనికి నేను చాలినవాఁడను కాను. వారి ఆత్మజిజ్ఞాస సాహితీరంగమున నెట్లు ప్రతిబింబించెనో చూపుటకు మాత్ర మిది వ్రాసితిని. తుదకు సాహిత్యవిమర్శయందును, చరిత్రపరిశోధనమందును కల్గు ఈర్ష్యాద్వేషాదులను రోసి వారు వానిని వదలి తమ జీవితమును మానవ సేవకే అంకితము జేసిరి. అ సందర్భమున వారు చెప్పిన పద్యములు.

   కవితాశిల్పము సల్పఁగాఁ దొలుత వేడ్కల్ రేగె నాకు౯, గృతుల్ 
   చివురెత్తె౯, వెస మోము మొత్తె, నిఁక నాచేఁ జెల్ల వీ కల్ల బొ 
   ల్లి వినోదంబు, లవే జరామరణముల్ చీడల్ హతం బార్చి పు 
   ట్టువు చెట్టు౯ సఫలీకరించుకొని యంటుల్ గట్టెద౯ మాలినై.
   త్రికరణశుద్ధిగా భవదధీనుఁడనై యితర ప్రవృత్తి వీ 
   డికొని పరార్ధలాభ మొకటే గమనించుచు  నుందు, నింక మా 
   యికము ధనాదికమ్ము గణియింపను, సత్యదయోపకార సా 
   ర్థక మగునాత్మచింతనపథంబునఁ దప్పి చరింప నీశ్వరా!
   శ్రీ శాస్త్రిగారు కల్పనాసాహిత్యమును నిరసింతు రనియు, సాహిత్యమున సైతము కరుణను, నీతిని ప్రధాన