పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

బలవ త్తర ప్రమాణము లున్ననే గాని విశ్వసింప వీలుగాని క్రొత్త విషయ మిది! తొలుత టెలిఫోను పద్ధతిని ప్రదర్శించినపుడు అచట నున్న ఒక గొప్ప రాజకీయ వేత్త దాని నొక గారడీ యని నిరసించె నట! తాను మాటాడుచు, ఆ కంఠద్వ ని మఱొకరినుండి వచ్చుచున్నట్టు చేయు కళ (ventrilo quism) అనె నట పాశ్చాత్య భౌతిక శాస్త్ర పరిశోధకులు క్రొంగ్రొత్త విషయములను కని పెట్టినపుడు పలుమారులు వారి నప్పటి పండిత ప్రపంచము హసించుటయో, హింసించుటయో జరగెడిది. గెలీలియో నుండి జగదీశబోసు వఱకు శాస్త్రపరిశోధనా చరిత్రలో నిట్టి సన్నివేశములు పెక్కుగలవు. కాని అభూతజ్ఞాతము లగు విషయములను సునిశిత ముగను, పలుమారులును సంశోధింపక యే యొప్పుకొనుట వలన గూడ ఒప్పుమి గలదు. ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రపంచమునకును, భౌతిక ప్రపంచమునకును నిచ్చెనలు వేయుపని చాల ప్రమాదభూయిష్ఠమైనది. మార్గమా క్రొత్తది. దారి చూపువారా లేరు. ఈ దారి ఎటకు గొంపోవునో తెలియదు. మన యాయుష్కాల ములో గమ్యస్దానమును చేరగలమో లేదో తెలియదు. అందుచే నీ రంగములోని యన్వేషకునకు

           "అసతో మా సద్గమయి 
              తమసో మా జ్యోతి ర్గమయ 
              మృత్యో ర్మామృతం గమయ"
                                                                                                              బృహ. ఉ. 1, ౩. 28.
   అను నిత్యపధికుని ప్రార్ధన మొక్కటే తోడు,