పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

బాధ తగ్గనిచో కారణ మన్వేషించుచు, దోషములను దిద్దుచు, ఆ దిద్దుగడతో నారోగ్యము చక్క బడుట గమనించుచు, అనవరపరహిత కాంక్షతో కాలము గడపెడి వారు శ్రీ శాస్త్రిగారు.

ఆపట్టున నే నచట నలుబది దినము లుంటిని. ఆ కాలమున ట్రీట్మేంటుకు సంబం ధించిన వింత లనేకము జరిగెను. వాని నన్నింటి నిట వ్రాయ వలనుగాదు. నాకు సంబంధించిన వొకటి రెండు చెప్పి విడిచెదను.

శ్రీ శాస్త్రిగారి వద్దకు చేరునప్పటికి నాకు ఏమి తిన్నను వంటఁ బట్టెడిది గాదు. నిద్ర ససిలేదు. కాని వలసి నంత యాహరమును నిర్భయముగ తిసికొమ్మని రనియు, పవలుసైతము నిద్ర పొమ్మని రనియు వ్రాసితిని. నే నా మాటల నక్షరశః పాటించితిని గాని అందుచే నెట్టి యసౌకర్య ము కలుగ లేదు. కొన్నాళ్ళయిన పిమ్మట ఒక ఉదయము " ఈ పూట ఏమి తీసికొంటి" వని శ్రీ శాస్త్రిగా రడిగిరి. రెండిడ్దేనలు, పదకొండుకు భోజనమా?" అని శ్రీ శాస్త్రిగా రనిరి. ఎక్కువ తింటిని గాబోలునని నేను నివ్వెరపోయితిని.' నీ ఒడ్డు పోడుగులకు రెండిడ్దేనలేమూల? నాలుగు న్యాయము " అనిరి. మరునాఁడు తిరిగి యడిగిరి." నాలుగు తీసికొంటి" నంటిని." ఆపైన" అని యడిగిరి." మామూలు పద్ధతి నొక యరకప్పు కాఫీ తీసికొంటి" నంటిని." ఇది కేవల మక్రమము. జోడిడ్దేనల కొక యరకప్పు. రెండు