పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

ళన! ట్రీట్మేంటుకు వచ్చిన వారి శారీరక, మానసిక సౌకర్యములను గూర్చి అంత శ్రద్ధగా విచారించెడి వారు శ్రీ శాస్త్రిగారు! చికిత్సాకాలములో చీకాకులు లేకుండ ఆనందముగ నుండ వలె నని వారి తలపు."ఏదో పుస్తకములతో కాలక్షేపము చేయుదు" నని నే నంటిని. శ్రీలక్ష్మి నారాయణగారు " ఈయన మంచి చదువరి. అందుచే ఉబుసుపోక కేమి చిక్కు లేదు" అని చెప్పిరి. దానికి శ్రీ శాస్త్రి గారు" పుస్తకాలన్నీ కట్టిపెట్టు. భోంచేసి కమ్మగా నిద్రపో" యనిరి. శ్రీ శాస్త్రిగారు బహుగ్రంధ పరిశో ధకులు. కాని పుస్తక పాండిత్యము పై వారి కభిమానము లేదు. మన మనశ్సరీరములే సర్వరహస్య ములను వెల్వఱించు పుస్తకములు. వానిని పఠించు తీరు అలవర్చుకొనుట మేలు అని వారి అభిప్రాయము. సాహిత్యమును గూర్చి వారి యూహలను తరువాత స్పృశించెదను.

సాయంత్రము తిరిగి నేను వచ్చినపుడు నాయాకలినిగూర్చి, భోజనపదార్ధములను గూర్చి, నిద్రను గూర్చి,వచ్చునపుడు తీసుకొన్న పాలు, పండ్లను గూర్చి, శరీర స్థితిని గూర్చియు వివరములడిగి తెలిసికొనిరి. నేను వారు చెప్పినట్లే నడచుకొనుటయు, నిద్రహారము లమరుటయు గుర్తించి బండి త్రోవను నడచుచున్నదని వారు తృప్తి చెందిరి.

వారికడకు వచ్చు ప్రతివారిని ఈరీతిగనే యే పూటకాపూట ప్రశ్నించి ధ్యానములో నేమి జరిగినదియు, ఇంటి వద్ద నెట్లున్నదియు తెలిసికొని ఉత్సాహపఱచుచు ఎవరికైన