పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

నా కంఠస్వరము బలహీనముగా నున్నదని వారనిరి. ఆ మాట నాకు క్రొత్తగా తోచెను. కాని పూర్ణారోగ్యము బడసిన పిమ్మట పోల్చిచూచికొనఁగా వారి మాట సత్యమని తెలిసికొంటిని. ఇది యెందులకు వ్రాసితి ననగా శ్రీ శాస్త్రిగారు యోగచికిత్సకు వచ్చు వారిని మొదటి చూపులోనే నిశితముగ పరిక్షింతురని చెప్పుట కే!వచ్చెడివారి ఆకారము, ముఖవైఖరి, మాటతీరు, కఠస్వరము, అంగవిన్యాసము, వారు తెచ్చెడి కానుకలు మొదలగు వానిని బట్టి వారివారి స్వభావ ములను, అనారోగ్యము తీరున శ్రీ శాస్త్రిగారు గ్రహింతురు. వారి యూహ తప్పగుట నే నెన్నఁడు చూడ లేదు. ట్రీట్రెంటులలోనే గాక ఈ కుశలతను వారు నిత్య జీవితములో నొక వినోదముగా నవలంబించెడివారు. దస్తూరిని బట్టి స్వభావమును తెలిసికొనుట, జాబులపై పోస్టుమార్కులను చూడ కుండ చిరినామా వ్రాసిన తీరునుబట్టి ఆ కవరు ఎచటి నుండి వచ్చినదో చెప్పుట, ఒకప్పుడా జాబు చదువకయే అందలి విషయమును చెప్పుట మొదలగు చిన్నచిన్న వినోదవిమర్శలతో వారి చుట్టు నొక చల్లని ఆశ్చర్యకరమైన వాతావరణము కల్పించెడి వారు.

ఆ తొలిపూట ట్రీట్మేంటులో నా శరీర మంతట ఒక శక్తి ప్రవహించినట్లుండెను. చెమట యోడికలు గట్టెను. హొటలుకు పోయి చక్కగా భోజనము చేయుమనిరి. సాయంత్రము వరకు కాల మెట్లు గడ పెదవని యడగిరి. క్రొత్తచోట నేమి చేయుటకు తోచక విసుగు చెందుదునని వారి యాందో