పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/204

ఈ పుట ఆమోదించబడ్డది

కొనెనో, చదువునాళ్ళలోనే కల్పించి చదివెనో యని కొందఱు సంశయించిరి. నా నిశ్చయ మాతఁడు కల్పింపను గాని, దాచి యుంచుకొనను గాని నేరనివాఁడే యని.

     భుజండనాడి 

శ్రీవారుండగానే, ధ్రువనాడి చదువుచుండు నాళ్ళలోనే యీ నాడి బయల్పడెను. ఈ నాడి గల యాతఁడు కుంభకోణ వాస్తవ్యుఁ డే. పట్టునూలి జాతివాఁ వలసినంత ధనము గొని తొలుత శ్రీవారి జాతకము చదివెను. అది చదువునాఁటి కాతనికి తద్గ్రంధ విధానము స్పష్టముగా నెఱుఁగ రాకే యుండె నఁట! ఆ జాతకము చదువుట వల్ల నాతనికి శ్రీవారియెడ భక్తి ప్రపత్తులేర్పడెను. శిష్యుఁ డయ్యెను. అన్వాహము శ్రీ వారిదో, శిష్యులవో, ఇతరులతో జాతకములు చుదువుట, దానివలని యా యతితో జీవితము గడపుట యాతని కేర్పడెను. ప్రధానముగా శ్రీవారియు,వారి కుంటుంబము వారియు,శిష్యులయు, వారి కుటుంబముల వారియు జాతకములు చదువుటలో నాతనికి తీరిక లేకుండెను.

   కొలఁది దినములలో శ్రీవారు శరీరము విడుతురనఁగా నాతని ప్రశ్నించిరి.' ఉన్నది యున్నట్టే వ్రాయుట, చదువుట జరుపుచున్నావా? కల్పనలు సాగించుచున్నావా?