పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/203

ఈ పుట ఆమోదించబడ్డది

జాతకము ముపక్రాంత మయ్యెను. పర్యాలోచింపఁ గా- శస్త్ర విద్యే = శస్త్రవైద్యమున (వైద్యము జరగు కాలమున) నజీవతి = చనిపోవును అని యర్దమగుట, అట్టగుటచేతనే జాతకపుఁ బైభాగము లేకుండుట తెలియనయ్యెను. అందఱును దైవవంచనకు ఖిన్ను లయిరి. ఇట్టి వానిని ధ్రువనాడీ చమత్కారముల నెన్నింటి నేని పేర్కొన నెఱుఁగుదును.

    అందు సి. వి. వి. యోగమార్గమునఁ జేరిన వారి జాతకములు పదులకొలఁదిగాఁ  జదువుట నే నెఱుఁగుదును. ఆ చదువుట నా సమక్షముననే జరగినది. శ్రీవారి జాతకమునఁగల విషయములే యనేకుల జాతకములం దున్నవి. శ్రీవారి జాతకమును, శిష్యులయు తదితరులయు  జాతకములును గొన్నా ళ్ళయిన తర్వాతఁ దప్పిపోవుటయు, మరలఁ జూడఁ గా సరియయినవి దొరకుటయుఁ గూడ నెఱుఁగుదును. శ్రీవా రుండఁ గా నా నాడీ గ్రంధమును శ్రీ వేపా రామేశము గారి దగ్గఱ గొన్ని వందలరూప్యములకుఁ దాకట్టు వెట్టుటయు వారు దానికి ఇండెక్సు వ్రాయుంచుటయు జరగినది. ఆ నాళ్ళలోఁ గ్రొత్తగా జాతకములు చదువుట సాగలేదు. మఱియు నాతఁడా నాడీ గ్రంధమును జదువుచుండిన నాళ్లలో వెల్లడి యయిన జాతకము లనేకము లీ యిండెక్సు చేసిన గ్రంధములలోఁ గాన రాలేదు. వాని నాతఁడు దాఁచియుంచు