పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది

ధ్రువనాడీస్వామి యగు శేషాచార్యుని విషయమున నీయర్ధముయధార్ధము. అస్మదాదుల మనేకుల మా గ్రంధమున నుండి యా నాఁడు జాతకముల వ్రాయించు కొంటిమి. అబ్బురము చెందుచు మిత్రు లనేకులకు జాతకములు వ్రాయించితిమి. వ్రాయు నప్పుడు విడువకుండ సన్నిధినే యుంటిని. ఇంత యేల? అస్మదాచార్యపాదాల జాతకము నందుండి పఠించునపుడు, వ్రాయించునపుడును నేను సన్నిధినే యుంటిని. ఇంకను గొందఱు మిత్రులుండిరి. ఆ గ్రంధము గల శేషాచార్యుఁడు శ్రీ వారియెడ నప్పు డద్బుతభక్తి గల శిష్యుఁడు వారి జాతకము నంతవఱకు నక్ష రాక్షరము సత్యముగా నుండెను.

   అందులో నాకు విడ్డూరము  గొల్పిన విషయములు గొన్ని యున్నవి.
   " బ్రహ్మస్వరూపో భగవాన్ దర్శనం చక్వచిత్ క్వచిత్ 
   ఆసర్శనం క్వచిచ్చేతి తత శ్చంచలబుద్దిమాన్ "
   అని నల్వదవయేటి వృత్తంతము వర్ణిత మయి యుండెను. ఇది చదువుచో  నేను  దగ్గఱ నుంటిని. ప్రతి పదము ప్రామాణిక మగునో కాదో యని శ్రీ వారు  పరీక్షించు చుండిరి. ఈ శ్లోకము చదువునపుడు కొంత యాగి యోచించి నవ్వి 'సరిగా వాక్రుచ్చినాఁడు. మీద చదువుఁ డు' అనిరి.
   అప్పుడీ శ్లోకమున కర్ధ మేమో బ్రహ్మదర్శనము లభించుట యనఁగా నెట్టిదో, అప్పుడే మి జరిగినదో వివరించి