పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది

వారి వారి గ్రంధములకే నాడీ గ్రంధము లని పేరు. అవి కొన్ని కొన్ని షష్టులకే రచితము లయి యుండు ననియు నావిశ్వాసము. వారువారాయాజన్మములలో జ్యౌతిష ప్రజ్ఞ కే పారమార్ధ్యము గల్పించుకొనుటచే భాషాపాండిత్యమునకై యంతగాప్రాకులాడ రయిరి. వారి గ్రంధముల లోనిభాషనిర్దుష్టముగాదు. ప్రౌఢములుగాలేకపోలేదు. రుచిగల, యరద విశేషముల గల జాతక భాగములఁ జెప్పుచో శ్లేషాద్యలంకారములతో నతి రసవంతమగు భాషతో నాయా గ్రంధ భాగము లున్నవి. అందు శబ్దజాలము క్రొత్తగా నేఁడు పుట్టుచున్నను మనుష్యులను గూర్చి వారి వర్తనముల గూర్చి పేళ్ళ గూర్చి కూడ నండును. ఈ నాఁడు క్రొత్త వెలసిన, వెలయు చున్న రేడియో, రేడియం, ఎక్సురే, కాస్మిక్రే, ఆటంబాంబు మొదలగు వానిని గూర్చి కూడ నందుం డును.

తద్గృంధక ర్తల నాఁటి కీ విషయములు భవిష్యద్విషయములే యయినను నా గ్రంధములలో నాయా భాగములఁ జదివి వెళ్ళడించి నంతవఱకు భూతమును, దరు వాతిది భవిష్య త్తును నగుట గాన వచ్చును. ఆయా గ్రంధములు చదివిన నాఁటి దాఁక విషయములు జాతకునకు చక్క సరిపడునవిగా నంత దాఁక తు. చ తప్పకుండ జరిగినవిగా నుండుటచే దానిని బట్టి తర్వాతి గ్రంధబాగమును విశ్వసించి జాతకుఁడు గయికొనును. తర్వాత నదితప్పిపో నారంభించును. క్రమముగా