పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/188

ఈ పుట ఆమోదించబడ్డది

తదాది జ్వరము లేదు. జీర్ణ శక్తి చక్క బడినది. ఆకలి యన్నది నాఁట నుండి ససిగా తెలియ వచ్చెను. దినదిన క్రమాభివృద్ధిగా నారోగ్యము కలుగఁ జొచ్చెను. ఆనాళ్ళ నుండి నాకు అనారోగ్యవ్యధ తొలఁగి వింతవింత యను భూతులు కలుగఁ జొచ్చెను. ఒక నాఁ డుదయము రొట్టెపాలు (కాఫియాల వాటు ముప్పది యై దేండ్ల వయసు తర్వాత నే) తీసికొని ప్రాతరుపాసనము జరపుకొని ఆఫీసుకు వెళ్ళితిని. తంజావూరి లైబ్రరీ ఉదయము 8 గంటలనుండి సాయంకాల మయిదు గంటల దాఁక) అప్పుడు ప్రాతఃకాలముననే కొన్ని నియమితసనయములలో సాయంకాలము దాఁక నభ్యాసము లుండెడివి.

   పదిగంటల వేళ నభ్యాసము జరపుకొని టేబిలు దగ్గఱ గ్రంధ పరిశీలనము జరుపు చుండఁ గా నా మూలాదారమున నుండి ప్రబలముగా పిచి కారితో కొట్టి నట్టు ప్రజ్ఞా బలధారాలు రేగఁ  జిచ్చినవి. ఉత్సాహా నందములు పొంగి పొరలి శరీర మెల్ల వ్యాపింపఁ జొచ్చినవి. ఆధారాలు తలలో నికిఁ బోయినవి అప్పటి నా యాహ్లాదము చెప్పఁ దరము కానిది. లోపల చిచ్చుబుడ్డి వెలిఁ గించి దాని పై పలుచని కుండ మూసినట్లు తల యూగులాడఁ జొచ్చినది. లోపల నేవో మెఱుఁగు రేకలు తిరుగఁ జొచ్చినవి. అప్పుడు పని కట్టిపెట్టి వినోదింపఁ దొడగితిని. పదినిమిషము లట్లుండెను. నా స్థితి యానంద తాండవ మాడు చున్నట్లయ్యెను. నెమ్మదిగా నది వశంగత మయ్యెను. నా యొడ లానంద మయ మయ్యెను. కొలఁది దినములకే ఆ లైబ్రరి పనిని వడిగా ముగించి వేసితిని.