పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/183

ఈ పుట ఆమోదించబడ్డది

టిమి. సత్రములో నుంటిమి. ఆ రాత్రి యా సత్రములో మా బంధువు లొకరు మాకు సర్వోపచారములు చేసిరి. ఉదయము బజారులో టర్పంటైను, బ్రాంది మొదలగు నౌషధద్రవములకుఁ బోగా వర్తకు లెవ్వరు నియ్యరైరి. రామకృష్ణ కవిగారు 'ఎం.ఏ 'మద్రాసు నుండి గ్రంధార్జనమునకై రాజా గారిని దర్శించుటకై వచ్చుట, వారితో నేను నుండుట యిత్యాదికము వెల్లడి యయ్యెను.

   ఆ యూరికి వచ్చు పెద్దమనుష్యులకు, ఉద్యోగులకు వలసిన పదార్దములు రాజాగారే యియ్యవలెను గాని కోమట్లియ్య గూడ దని యను శాసనము. కవిగారు 'కాళ్ళిడ్చు కొని పోవుచున్నవి. జీవితము నిల్చునట్లు లేదు. కలరా గాఁ బోలును. బ్రాంది కావలెను, కాళ్ళకు టర్పెంటైను రాయ వలె'నందురు. అవి దొరక లేదు. రాజాగారిని దర్శింప మధ్యాహ్నము గాని వీలుపడలేదు. రాజాగారు భోజనా నంతరము నిద్ర లేచిన తర్వతా నేఁ బంపిన వార్త వారికిఁ దెలుపు ననువుపడెను. వలసినవానిని వారు పంపిరి. అప్పటికే కవిగారికి మా బంధువుల యుప చారములచే గుణముగా నున్నది. మందు లక్కఱ లేకేపోయెను. ఈ వార్త ఆఱు మైళ్ళ దూరమున నున్న మాగ్రామమునకు తెలియగా, మా తండ్రిగారు పంపగా మా పినతండ్రిగారు బండిలో మమ్ము తోడ్కొనిపోయిరి.                                                                                    

చల్లపల్లిలో నే కవిగారి యుపచారములలో మునిఁగి యుండుట, వారితో నేను జీడిపప్పు తిని నీరు త్రాగియుండుట