పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/179

ఈ పుట ఆమోదించబడ్డది

తూరి పిలువగా నవతలి వారు సిద్ధముగా బదులు పలుకు చుండగా దానిని వినక యూరక పిలుపులే పిలుచువాని తీరువంటిది పదింబదిగా స్మరించుచుండుట యనిరి. ఈ యుప దేశపు యాదార్ధ్య మటుతర్వాత పరసహస్రపర్యా యములు నాకును నా మిత్రులకును ననుభూతి కందినది.

1925వ సం, ప్రాంతముల నొక మిత్రుఁడు నిరంతరము శ్రీవారి స్మరణమే రామనామజపమువలె జరుపుట సాగించెను. కొన్నాళ్ళకు శరీర మెల్ల నగ్నిజ్వాల వలె నెయ్యెను. నిద్రలో నరములు బిగించిన ట్లయి త్రుళ్ళిపడుట, క్రమముగా నిద్ర పట్టకుండుట యేర్పడెను. బంధువులు పలు వైద్యములు చేయించిరి. యోగము నే మాన్పించిరి. ఏమియు లాభము లే దయ్యెను. జరపిన తప్పిదమునకు పశ్చాత్తాపము సెంది క్షమింప ప్రార్ధించి సక్రమముగా నడచుకొన సాగించిన తరువాత నారోగ్యము చక్క బడెను. ఆ మిత్రుఁడు నేఁడును క్షేమముగా యోగ సాధనము చేయుచున్నాఁడు.అనధికారముగా, అక్రమముగా సాధనములు సాగించిన వా రింక నెందఱో పశ్చాత్తప్తు లయి బాగు పడవలసిన వారైరి.

                                            ----