పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/177

ఈ పుట ఆమోదించబడ్డది

పక్షము బరు వెక్కువ గలదిగా గాన వచ్చెను. ఆత్రపాటుతో నదే సమాధానము జాబులో వ్రాసెను.' శ్రీవారు బదులు పలుక రైరి గదా! ఇక నాలసింపరాదు, కనుక దీనినే పోస్టు చేయుదు' నని యాతఁడు యోగశాల నుండి బయల్వెడలెను.

   శ్రీవారు తమ యింటివాకిట నుండిరి. రమ్మని కనుసైగ చేసిరి. చేరబోగా ' చేతిలో ఏమిటది?'అనిరి.' బదులు వ్రాసితిని. అనుకూల ప్రతికూల పక్షములు యోచించి చర్చింపఁగా ప్రతికూలపక్షము బలవంతముగా తోఁచెను. తామేమి సెలవిచ్చిన నట్లు చేసెదను. టపావేళ దాటు చున్నది. కాన నాకు తోఁచినది వ్రాసితిని. తద్విరిద్ధముగా మిరు సెలవిచ్చిన నట్లు వెంటనే చేసెదను' అనెను.' ఈజాబే పోస్టులో వేసిరమ్ము' అనిరి. ఆతఁ డట్లే చేసెను.
   తర్వాత సమయాంతరమున నిట్లు చెప్పిరి.' మి కేవి గాని సందేహములు తోచినచో తోచినవానికి బదుళ్ళు యోచింపక వెంటనే వాని నట్లే నాకు వ్రాయుటో, అడుగుటో చేయవలదు. మీ చేత నయినంతవఱకు వాని సమాధానములను మిరే కనుగొన యత్నింపుఁడు. ఎంతకును సమాధానము దొరకని వానినే నన్నడుగుఁ డు. న్యాయమైన, సంగత మైన ప్రశ్న మెవరికి గాని తోచినచో, నా ప్రశ్నపుఘనత ననుసరించి దానికి తగినంత త్నము చేసినచో సరి యయిన సమాధానము దొరకఁ గలదు. ఆ యత్నము బహిర్ముఖ మగు ప్రాచీన గ్రంధాదుల వల్ల తనకు విజ్ఞు  లుగా తోచు నాప్తులవల్ల తెలియఁ దాగిన దగును. అంతర్ముఖ మగుచో ఆత్మోద్బోధ