పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

౨౫

దివ్యబోధ

ఆ నాఁటిరాత్రి మెయిలులో నేను తిరిగి మద్రాసు వచ్చి వేయవలసి యున్నది. కాన నా విషయమును గూర్చిశ్రీ వారితో సంభాషించుటకు నదను కోరితిని. నా యభ్యర్ధనమును మహా దేవయ్యగారు శ్రీ వారికి నివేదించిరి. భోజనా నంతరము సంభాషింప శ్రీవా రనుమతించిరి. అప్పుడు వారు యోగ విషయములను గూర్చి వారి యర్ధాంగి ద్వారా యేవేవో యపూర్వాంశ ములను సేకరించుచుండిరి. భోజనా నంతరమున నేఁ జేర నరిగి సాష్టాంగనమస్కారము చేసి యిట్లు విన్నవించుకొంటిని.' మూఁడెండ్లనుండి యమ బాధ పడుచున్నాను, నిద్రలేదు, శాంతి లేదు, ఆకలి, జిర్ణించుకొను శక్తి సరిగా లేవు. ఇక్కడికి రాక తలఁపునకు ననఁ గా నా యోఱుకకు దెలియకుండ నే సరిగా భోజనము చేయగల్గితిని. మి యోగమాహాత్మ్యమును శ్రీ నరసింహము గారి ద్వారా విన్నంతనే నాలో నేదో దివ్య సౌఖ్య సౌధమునకు బాట గోచరించు చున్నట్ల యినది. ప్రశాంతము గా రాఁ గలిగితిని. రైలులో కొంత నిద్ర పట్టినది. ఇక్కడికి వచ్చికడచిన రాత్రి సుఖముగానిద్రించితిని. నూనె తిరుగ బోత, ఆవాలు, సాంబారు, రసము, పల్చనిమజ్జిగ యివి నా కింతకు ముందు కడుపులో మంటలు గొల్పెడివి. ఇప్పు డవి వికటింప లేదు. మీరు నిర్భయముగా అందఱతో పాటు భుజింపవచ్చు