పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

ట్టేదో చెప్పసాగిరి. మహా దేవయ్యగారు దానిని వడివడిగా వ్రాయసాగిరి. ఇద్దఱును యఫ్. యే చదివిన వారు, ప్రజ్ఞా శాలులు. పిళ్ళ గారు వడిగానే చెప్పసాగిరి. అయ్యరు గారు వడిగా వ్రాయ సాగిరి. ఉదయము సరిగా తొమ్మిది గంటల పదునేడు నిమిషముల వేళకది వ్రాయ నారంభించిరి. పిళ్ళ గారు కనులు మూసికొన్నప్పుడు అంతర దృష్టికి కనుపడి నవి, ఆంతరశ్రుతికి వినబడినవి చెప్పఁ దొడఁ గిరి. అప్పుడు నా శరీరాం త ర్భాగమునఁ గల స్వస్ధ్యాస్వాస్ధ్యములు, న మనో భావములు , నా యనరోగ్యము కారణములు, తన్ని వారణో పాయములు, అప్పటికి జరిగిన పూర్వ జన్మములు మొదలగు నవి కలవు. అది యెల్ల ముగిసిన పిదప దానిని శ్రీ వారి చెంతకుఁ గొనిపోయి వినిపించిరి. వారి సమ్మతి మిఁద దానిని రికార్డు చేసిరి. ఆ కాలమున యోగాభ్యాసమునకు వచ్చి శిష్యతను బొందువారి కందఱకు నట్టి టెస్టు తీయుట జరగు చుండెడిది. నన్నుఁ గూర్చి వచ్చిన రికార్డును కాపి కోరితిని. శ్రీ వారి సమ్మతితో దానిని నాకిచ్చిరి. అది నా దగ్గఱ నున్నది.

--- ---