పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/158

ఈ పుట ఆమోదించబడ్డది

రించెను. కేలుదోయి మోడ్చి నమస్కరించి జాబు నర్పించు కొంటిని. చదివి, నవ్వి ' స్నానాదికము గావించి విశ్రాంతి గొను' మనిరి.

నాకు శ్రీవారిదర్శనము చేయించిన ఆస్వాముల వారు నన్ను స్వజనముగా నాఁడే కాక వారు జీవించి యున్నంత దాఁక ప్రేమించుచుండిరి. వారి పేరు సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి. అప్పటికిఁ గోన్నేండ్లకు ముందు వారు బందరులో సన్న్యసించిరి. బ్రాహ్మణ్యులు జంధ్యాల గౌరీ నాదశాస్త్రి గారు వారి కుద్యోగము నుండి పెన్షన్‌ ఇప్పించి యాస్రమ మిప్పించి రఁట! ఆకారణమున వారికీ కృష్ణా మండలము వారన్ననది కాదరము. వారి జన్మ దేశము కాచీ మండలము. తెలుఁగు బ్రాహ్మణులు. సాన్న్యాసానంతరము వారు మహా నీయు లని ప్రఖ్యాతి గన్న స్వాముల వార్లను గొంద ఱను వెన్నడించి విసుగు గొని శాంతి లేక తిరుగాడుచు శ్రీవారి మహానీయతను విని వారికడకు వచ్చి ఆజీవితము అక్కడ నే నెలకొనిపోయిరి. శ్రీకృష్ణునకు సాత్యకివోలె వారు శ్రీ వారికి సదానువర్తనులై యుండిరి.

నే నప్పటికీ తొట్టె స్నానము సరిగా చేయకున్నను కారము లేని, తిరుగబోత లేని కూరలతోనే భోజనము చేయుచుంటిని. శ్రీవారితో నా స్ధితిని విన్నవింపఁగా ' ఇఁక నీ యారోగ్య రక్షణ భారము నేను వహించితిని. వెఱవక నలువురితో పాటుగా మామూలు భోజనము చేయవచ్చును. దానివల్ల నీ కేమి చెఱుపు రాదు' అనిరి. ఆవాల తెట్టె తేలుచున్న చారుతో ,