పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/145

ఈ పుట ఆమోదించబడ్డది

పింప నుద్దేశింపఁ గా నేను వెళ్ళే యంటిని. వానిని గ్రామాంతర మున నుండి పిలిపించిరి. నలువది దినములు మంత్రజపమాయన జరపెను. ఆయన వల్ల నా కేమాత్రము మేలు జరుగ బోదని నేను బిగ్గ పలుకుచుండెడి వాఁడను. వీనికిఁ పట్టిన గ్రహ చారమో, గ్రహమో ఉపకారకము లయిన పద్ధతుల పై వీనికి విశ్వాసము కుదురు నీయ కున్నదని మా వారు తెగడఁ జొచ్చిరి." నిజమే! నా కిట్టివారి ప్రజ్ఞ మిఁ ద విస్వాసను లేదు. అదే నా జబ్బు అనుచున్న వారు మిరో వారో కొల్పుఁడు' అనువాఁ డను. నలువది నాళ్ళయిన తర్వాత జల ఫలము నాకు ధారాద త్తము చేయుటకు గొప్ప బ్రాహ్మణ సంతర్పణము జరపిరివృధా ధనవ్యయ మని నేను వగవఁ జొచ్చితిని. ఇట్టి చీకాకు లెన్నో పడితిని. వేనివల్ల గాని నాకు మేలు జరగా లేదు. తొట్టె స్నానము, ఉప్పుకారములు లేని భుక్తి ఒక మాదిరిగా చేయుచునే యుంటిని.

మద్రాసులో నా స్థానమున నియుక్తులైన విద్వాంసులు హఠాత్తుగా అంతరించిరి. చలి జ్వరము నూట యాఱుడిగ్రీల పై చిలుకు వచ్చి ఆ తర్వాత ఔషధము నిరుప యోగము కాఁగా పుణ్యలోకముల కరిగిరఁ ట! మా ఆఫీసు క్యురేటరు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారు నాకు డి. ఓ. వ్రాసిరి .' నీవు వచ్చి డ్యూటిలో చేరుట మంచిది. నీకు తొందర కలుగకుండ దేశాటనము చేయ నేర్పాటు చేయుదును. రావలసినది' అని. ఆవత్సరమున ఆంధ్ర సాహిత్య