పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/142

ఈ పుట ఆమోదించబడ్డది

సంక్షోభపడు టాయెను, కొని రాత్రులందు సన్నని తెర గప్పినట్లు నిద్రపోకుండేడి దేమోకానీ చీకటి వేసినను కనులు తెఱచునంత తేలికగా నుండెడిది, దాని జూచి మా వారు కొందఱునిద్ర కొంత ఉన్నదనుచుండిరి.

అప్పటి నా తలపులలో నొక్కటి. ఏ పుణ్యాత్ముడేని ' ని విట్టి పాపకర్మము చేయుటచే ని వ్యాది ఏర్పడినది క్లోరోఫారంఇయ్యకుండ ఖడ్గముతో నీ కుడిచేతిని ఠస్సని నఱెకి వేయుదును. దానికి సమ్మతింతు వేని, ఆబాధకోర్వ గల్గుదు వేని, తర్వాత ని కుడి చేతి లేవడి కిష్టపడుదు వేసి, చేతి నఱెకు మానదగినన్నాళ్ళకు ని వ్యాధి కూడ మాన్పింతును. చేతినిఱకువల్ల నీ కపాయము రాదు, అంతట నీ కర్మతీరును' అన్నచో తక్షణమే అందుకు సిద్దపడగాలను అనుకోనుచుండెడి వాడను. అంత తీవ్ర మయినది నాబాధ. ఇట్లితరులతోను చెప్పచుండువాడను క్షణక్షణము మరణయాతనయే. ' దిన దిన గండము' అనుకొనువాడను. ఆప్తె మాట 'వేయ్యేండ్లా యుస్సు' లోలో నెక్కడో తోచుటే కాని గుండెలలో వాక్యాకృతికి దానిని దెచ్చుటకు నోట నుచ్చరించుటకు దుఃఖించెడివాఁ డను! దినదిన గండముతో వేయేండ్లాయు స్సెందుకు? వేయేండ్లు కాదు. వేయి గంటలలయినను నెందుకు? అని బౌద్ద మతమువారు చెప్పుకోను పలుకులు " సర్వం దుఃఖం దుఃఖమ్ " " సర్వం క్షణికం క్షణికమ్" ' సర్వం స్వలక్షణం స్వల క్షణమ్ అనువాని రేధము సదా అనుభూతి కందు చుండెడిది. ఆ పలుకు నాల్కమిఁద మెదలుచుండెడిది.