పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది

లందరా దని నిశ్చయించుకొంటిని, ఇంత వ్యాధి యున్నను దినములు, వారములు, నెలలు, ఏండ్లు నిద్ర లేక బాధ పడుచు సర్వవికారములతో నున్నను నా మనస్సుమాత్రము తార్మారు కాక, ప్రజ్ఞ చెడక, జఞపకశక్తి చెదరకసరిగానే ఉండెను, కాని స్ధిరముగా కూర్చుండి అరగంట సేపయిన చదువుట మొదలయిన మనః పరిశ్రమ చేయజాల కుంటిని, పదిదినముల కొకతూరి తీవ్రముగా చాలగా అదోమార్గమున వెడలుట, నాలుగు మూడు రోజులు కొంత శాంతిగా నుందుట, మఱల కడుపులో మంటలు , తాపము , నిద్రలేమి ఇత్యాదులు చెల రేగుటగా నుండెడిదిచాలని చప్పని యాహారమే, తొట్టె స్నానమేనాకు గొంత శాంతి కరముగా నుండె డిది, ఆ తొట్టె స్నానములు చేయుట మూలమున ఆముదము పుచ్చుకొనుట క్రమముగా మానివేసితిని.

ప్రతిదినము ఆంధ్రపత్రిక చుదువుచునే యుంటిని. యుద్ద వార్తలు తెలిసికోనుచునే యుంటిని, దానిని చదువ కుండ నుండ లేను, నేటికి నంతే చదివియు నుండలేను, చదివినచో యుద్దమారణము లను భూయమనములుగా నుండేడివి, చదువకున్నచో యుద్దమున నేమి జరగుచున్నదో తెలియదాయెగా యన్నవ్యధ కల్గెడిది. పగల పండ్రెండు గంటలే కాక రాత్రి పండ్రెండు గంటలుకూడ నిర్వ్యాపారముగా మెలకువతో, వ్యాకులతతో నింటిలో కొందఱ కేని యతృప్తితో నితరులు గుర్తింపరానంత తీవ్రవ్యాధితో