పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

౨౦

ఔషధసన్యాసము

అప్పడు మరల నంజుండరావుగారిని చూచితిని, ఆయన తిట్టి చివాట్లు పెట్టి నీవు బ్రదుకఁదలచుకొనిన నిక నెవ్వరి యొద్దను మందులు పుచ్చుకోనక స్వాస్ధ్యము కలుగుత కేండ్ల పా టయినను నూరికి వెళ్ళి యింటిదగ్గఱనె ఉంది పొమ్మని నిర్భందించెను. ఏవేవో మందు లిచ్చెను గాని యవి కూడ పని చేయలేదు. తలమీద పాము పొల సూడినట్లు తోలుపోడ లూడసాగెను. స్వగ్రామమునకు వచ్చివేసితిని, చల్లగా ఆహారము గోనుచుండగా నుండగా కొన్ని నెలలు కామంటలు కొంత తగ్గినవి, తొట్టె స్నానములు చేయ నారంభించితిని, కొన్నాళ్ళ కది కొంత యుపకారక ముగా నున్నట్టుండెను.

అప్పడే నానోట 'ఔషధసన్యాస' మన్న పలుకు పదింబదిగా రాసాగెను. ఇక చచ్చినా సరే! ఏమయినా సరే! మందులు పుచ్చుకోరాదు అన్న సంకల్పము ప్రబలముగా తోచసాగెను. తెలియని శరీరంతర తంత్రములను సరిగా నెఱుఁగక, ఔషధీగుణములు, నందు ననేకౌషధులు మిశ్ర మయిన మందుల గుణములు సరిగా నెఱుగక, వ్యాధి నిదానము సరిగా నెఱుగక యరకొఱయెఱుకతో గ్రుడ్డియెద్దు చేన బడ్డట్టు సాగుచున్న భేషజతంత్రముతో నింక చిక్కు