పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

ఎమ్డెన్ గుండ్ల దెబ్బలు నాటికి పదిపదునైదునాళ్ళకు ముందు రాత్రి వేళ పారిస్ కార్నరులో తగులుట, ముందుగా ఎమ్డెన్ నౌకవారు మదరాసు నగరముప్తె తీవ్రమయిన టార్చిలైటు ప్రసరింపజేయుట నాయనారోగ్యారంభావస్ధలో నుండి యెఱుగజాల నయితిని, మర్నాడు రెల్ల జెప్ప కొనుట వింటిని. అంతదాక ఇండియానుండి కృత్రిమయత్నములతో యుద్దభటులను గొనిపోవుట, కసాయివారికి మేకల నర్పించినట్లు యుద్దభూమిలో వీరిని బలియిచ్చుట, దేశ దౌర్భాగ్యము వినిగూర్చి విచారమే కాని ఇండియాలోనే యుద్దవికృతులు గానవచ్చుట యెవ్వరు గాని ఊహింపని విషయము, యుద్దచింత నన్నల్ల కల్లోలములలో ముంచి వేసి నది, నాడు బాలయ్య సెట్టిగారి యింట ఫిరంగిగుండ్లముక్క లూరెల్ల బడుట దాని చూచి నిండు జివి యాకస్మికముగా చనిపోవుట వినప్తె యుద్దమున నిండుజివులు గుండు దెబ్బలు, ఈటే పోట్లు వాగ్తెరాలు తగిలినప్పుడు చెందు మరణయాతన నా దేహముననే గోచరించుచున్నట్టు తోపసాగినది. క్షణ క్షణమును నాకు మరణయతనయే, ప్రతిదేశలేశములోను, ప్రతికాలలేశములోను నాకు మృత్యుభయమే, చచ్చిన చావూ కాక బ్రదికిన బ్రదుకు కాక చావుబ్రతుకుల సందులో ఊగులాట యయ్యెను.

--- ---