పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/131

ఈ పుట ఆమోదించబడ్డది

౧౮

ఆవేదన

రెండు మూఁడు నెల లింటికడ నుండి నేను మాతమ్ములతో మద్రాసు చేరితిని. కొన్నాళ్ళు మా బావగారింటను, గొన్నాళ్ళు హోటలులోను భుజించుచుంటిమి. ఇంటికి వెళ్లి ఇల్లాలిని వెంటగొని వచ్చితిని. అంతకు పూర్వము నేను చెందిన వెఱపు మఱపునఁ బడెను. గార్హస్ధ్యముతో ప్రాచ్య లిఖితపుస్తకశాలగ్రంధపఠనీత్సాహముతో కాలము గడచుచుండెను. అప్పటికి చాటుపద్యములు చాలా చేర్చి "చాటు పద్యమణిమంజరి" యని పేర గ్రంధముగా సంధానింతిని. వానిని ముద్రించి ప్రకటించుటలో శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు నాకు చాలా సహాయము చేసిరి. వేయి రిప్లై కార్డుల మిఁ ద (కార్డు కాని వెల) నోటీసు, పుస్తక మాపేక్షించువారు వ్రాయుటకు పై అడ్రసులో పోస్టు చేయించిరి. వెంట వెంటనే వేయి పుస్తకములు నమ్ముడు పోయెను. ఇట్లు నేను పుస్తక వ్యాపారము చేయుదు నని దుఃఖించిన పుస్తక వ్యాపారు లున్నారు. దీని తర్వాత, ప్రబంధరత్నావళి, భాస నాటకములు, కొన్ని ప్రకటింపఁ బూనితిని. కానీ ఇవియెల్ల ' నీవు వ్యాపారము చేయాలనే? మా కిచ్చిన మే మమ్మి సోమ్మిత్తుము గదా' యని కోరు పుస్తక వ్యాపారులకు, అప్పటికి నేను మరల అనారోగ్యగ్రస్తుఁడ నగుట, తర్వాత దేశాటనము చేయవలసినవాఁడ