పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

మూఁడు నాలుగు నెలలకు నే నంతకు ముం దెన్నఁడు నెఱుఁగని యారోగ్యము పొందితిని. నా తలఁ పున గుర్తించినవారగుటచే మా తలిదండ్రులు, నక్కగారు పునస్సంధాన ముహూర్తము నిర్ణయించుటకు మా యత్తవారిని గోరిరి. ఇంకను గొంత కాలము మా మామగారు ముహూర్త నిర్ణయమున కంగీకరించిరి. కొలఁది రోజులు ముందుగా మా సోదరికి గూడ పునస్సంధాన ముహూర్త మేర్పఱచిరి.

అంతదాఁక బులపాటము చెందుచున్న నాకు ముహూర్త నిర్ణయము నాటనుండి చాల మనోదుఃఖము రేగెను. నా వ్యాకులతను గుర్తించి రేకానికారణమేదోయెవ్వరునెఱుఁగరు. తొలుత నేను నెఱుఁగను. కారణ మెఱుఁగ రాకుండ వ్యాకులత పెరుగసాగెను. వివాహము నాఁటి నుండియు నా జీవితము క్లేశముల పాలగుచుండుట, దానికి కారణము పెండ్లాడిన పిల్ల జాతకముపొంతనములు ససిపడినవి కాకపోవుట యని మావారు చీకాకు చెందుట యని వెదకి వెదకి కొంత గుర్తించితిని. నా వివాహము నాఁడు వధువు జాతకము చూపింప గోరఁగా మా మామగారు నేను జాతకము వ్రాయ లేదని చెప్పి వేసిరి. కాన దాని గుణదోషములు గుర్తింప వీలుపడదయ్యెను. అసలు నాకు జాతక పరిశీలనము మీద విశ్వాసము లేదయ్యెను.' యస్యాం మనశ్చక్షుషోర్నిబంధ స్తస్యా మృద్దిః ' అన్న ధర్మసూత్రము నాకు నవ్వ్హి నేను మనసార ప్రేమించి యా పిల్లను బెండ్లాడితిని గాన నా కప్పుడు కొఱఁత తోఁపలేదు.