పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

౧౭

తొలి కలయిక

నాకు టైఫాయిడ్ తగ్గి యారోగ్యము లభించు నాఁటికి జీవిత వాంఛలు రెండు గల వంటిని. తొలిది శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనము. అది తొలుత నగమ్యగోచరముగా నుండుట, యీనాఁ టికిఁ జాల విషయములు దెలియ నగుట రేఖామాత్రముగాఁ జెప్పితిని గదా! రెండవది వివాహ మాడితిని గనుక అచుంబిత ప్రక్రియయ గుస్త్రీ సుఖము నను భవింపగోరుట. అది యేదో వేంకటేశ్వర దర్శనము వలె నపూర్వాద్భు తాతిలో కానందము గొల్పునదిగా నుండఁ గల దనుకొనుచు నువ్విళ్ళురుచుంటిని. ఈ రెండు నెఱవేరినచో నా జీవిత ప్రయోజనము లభించినట్టే యనుకొంటిని.

తిరుపతినుండి యింటికి వెళ్ళినతో డ్తో నారోగ్యవృద్ధి క్షణక్షణవిజ్రుంభణము గాఁజొచ్చినది. మా తలిదండ్రులు వగైరాలు మద్రాసునుండి వచ్చుదాఁక ఇంచుమించుగా పదునైనాళ్ళు నా మిత్రులు శ్రీ సుసర్ల కుమార స్వామి శాస్త్రి గారి యింటనే యుంటిని. వారును, వారి కుటుంబిని శ్రీమతి రామమ్మ గారును నన్నుబిడ్డను గాఁగాపాడిరి. ఆకలి నాక మితము గారేగుచుండెను. ఎక్కువగా భోజనము చేసెడి వాఁ డను. దృష్టి తగులు నని రామమ్మ గారు నాకు చాటుగా భోజనము చూడ కుండు నట్లు భోజనము పెట్టుచుండెడి వారు. ఆ దంపతులు నేఁడు లేరు. వారి పుణ్య గతికై తలఁపు నాకు వచ్చినపు డెల్ల తపించుచుందును. కుమారస్వామి శాస్త్రిగారిని నేను నా భృక్తరహిత