పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

ఇదిగో చేరబోవుచున్నాను అని మురియఁ జొచ్చితిని. అప్పుడే తీవ్రానరోగ్యవిము క్తుఁడ నయితిని గాన దౌర్బల్యము ప్రబలముగా నున్నను నీ యుత్సాహము నన్ను ద్బోదింపఁ గా స్వామి పై నేవో పద్యములు పయనములో రచింపఁ దొడఁ గితిని. తిరుచానూరిలో నుపనయనము జరపితిమి. స్టేషను నుండి యెండలో నాయూరు చేరుటలో మా యన్నగారి కుమారైకు పసిబిడ్డకు తీవ్ర జ్వరము వచ్చెను. జ్వరము తగ్గుదాఁక నేనదే చేయుదునని కూర్చుండి పద్యములతో స్వామి స్తుతి చేయఁ జొచ్చితిని. జ్వరము కొన్ని గంటలలో తగ్గిపోయెను. పద్యములు చాల రచింతిని. వాణిలో నొకటి రెండు:-

చుఱ్ఱని మేను కాలెఁగనుచూడ్కి వికారము దోచె నన్నకుం
గుఱ్ఱది యాఱుమాసములకూన యిదెక్కడి వేకిసోకొ మా
మొఱ్ఱల నాలకింపుము నమోనమ! యప్పన నీకు నప్పనా
చిఱ్ఱున చీదకుండ సుఖసిద్ధికిఁ దార్పుమి బిడ్డఁ దేర్పుమి!

జ్వరము తగ్గినపై

అంకిలి లేనిభక్తి మనసారఁ దలంచి నమస్కరించి మా
సంకట మార్పవే యన వెసన్ సుఖ మిచ్చి యనుగ్రహించి తో
కింకరకల్పకంబ! పరికించితి నీమహనీయతన్ ' కలౌ
వెంకటనాయకో' యను సువిశ్రుతసూక్తియధార్ద భావము న్.

ఆనందముతో నందఱము గొండ లెక్కితిమి. వృద్ధులు గాన మా నాయనగారంతకు ముందు పలుతూరులుస్వామి దర్శనము చేసిన వారు గాన దిగువతిరుపతిలోనే కొలఁ ది కాలము క్రిందటనే కట్టిన' పుష్పతోట' సత్రములో నుండిరి. స్వామి దర్శనముకై యువ్విళ్ళూరుచు వెళ్ళితిని. కాని యక్కడ నా