పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసి యిచ్చిరి. గిడ్విన్ కంపెనీ వారు మందు లిచ్చిరి. అ మందులు త్రాగిన పదినిమిషములకే ప్రాణము ససిగా చేరుకొనేను. జ్వరము 22 దినములకు తగ్గినది. ఈ నడుమ కొన్ని యొడుదుడుకు స్థితులను గలిగినవి. ఏమి కలిగినను వా రిచ్చిన మందులు వెంట వెంటనే నాకు గుండె నిబ్బరము కలిగించుచు వచ్చెను.

ఒకనాఁడు విరేచనము లగుట కేదో కొంచెము మందిచ్చి మామూలుమందులు పుచ్చుకొనవల దనిరి. ఆనాఁ డు నాకు నిస్త్రాణ హెచ్చును. డాక్టరు రాగానే ' దినము త్రాగే మందు నేడు త్రాగవద్దంటి రట! అవి త్రాగగానే నాకు పుష్టి కలిగెడిది. నే డట్లు లేదు' అంటిని. ఆయన నావీపు చఱచి, నవ్వి ' మరల వానిని తిసుకొనుడు' అనిరి, జ్వరము తీసిన తర్వాత అవి చికిన్ బాతు బ్రాందిలో కలిపిన దొకటి, ద్రాక్షాసవమువంటి దింకొకటి యగుట తెలియ వచ్చెను. ఆ తర్వాత రోఁత గొంటిని. కాని యప్పటిదాఁ క నా కవి యమృతకల్పములుగా దోఁ చెను.

ఆ జ్వరతీవ్రతలో నా జీవితమును గూర్చి సంశయ మేర్పడి మా బావగారు జాబు వ్రాయఁగానా మిత్రులు శ్రీకాకర్ల కుమార స్వామి శాస్త్రిగారు, మామామగారు, మాతలిదండ్రులు, అన్నగారు మద్రాసు వచ్చరి, ఆ తీవ్రానా రోగ్యపు నాళ్ళలో తమకుమారై రజస్వల యయ్యె నని మామామగారు జాబు వ్రాసిరి. ఆస్థితి మా వారికీ మఱింత వ్యాకులత గొల్పెను. ఎట్లో జ్వరము తగ్గినది. ఆరోగ్య వంతుఁడ నయితిని.