పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/116

ఈ పుట ఆమోదించబడ్డది

అనిరి. అందాఁ క ఇంగ్లీషు వైద్యము నే నెఱుఁగను. మా నాయనగా వచ్చిన మందు లిచ్చువారు. నా కందాక నంత తీవ్రానారోగ్యము లెప్పుడును రాలేదు.' ఆయుర్వదవైద్యము పరిచితము గాన, మిరు మిత్రులు గాన మిరే మందియ్యండి' అంటిని. వాటట్లే సమ్మతించి వైద్యము చేయబూనిరి. ప్రతిదినము ఆచారప్పన్ వీధినుండి మైలాపూరు శాలైలీవీధికి కొన్ని మైళ్ళు కోచి మిద వచ్చి పోవుచుండిరి.

విరేచనముల కానీ యొకనాఁ డావగింజంత మాత్రయిచ్చిరి వారు. పది రోజులనుండి నా కాహరంమే సరిగా లేదయ్యేను. ఆ మాత్రతో నానాఁ డా నాకు నాల్గయిదు విరేచనము లయ్యెను. దొడ్డిలోనుండి యింటిలోనికి వచ్చుట యెఱుఁగుదును. స్మృతి తప్పి పడిపోతిని. కొంతకు స్మృతి వచ్చినట్లయ్యెను. నాడి చూచుకొంటిని. నిమిషమునకు రెండు వందల దాపుగా కొట్టుకొనుసమాఖ్య యుండెను . గుండె యెగసి పోవుచుండెను. దగ్గఱగా నున్న రామేశంగారిని పిలుచుకొని వచ్చిరి. వారు నాడి చూచి అపాయస్థితిలో నున్నట్లు గుర్తించి వెంకనే డాక్టరు నంజుండ రావుగారికి చీటీ వ్రాసి మనిషిని బంపిరి. నాస్థితి గందరగోళముగా నుండెను. అప్పుడే కాచిన పాలు రెండళాకులు గబగబ త్రాగివేసితిని. పది నిమిషములకు ప్రాణ మందు కొనుచున్నట్టు తోఁచెను. అంతలో నంజుండ రావుగారు వచ్చి పరీక్షంచిరి.' తీవ్ర మయిన టైఫాయిడ్ జ్వరము. వెంటనే యీ క్రింది మందులు తెచ్చి యియ్యండి' అని చీటీ