పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

యుండునో వానిని నేనే తెలిసి, లిస్టు వ్రాసి, సంస్కరింప వలసిన చేర్చ వలసిన విధానములు, పద్యములు వ్రాసి పంపఁ గా ఆ విషయము నిట్లా స్మరించుట? సంస్మరణమున ఫలాని ఫలాని పద్యములను, గ్రంధములను వ్రాసి పంపవలసినది గా వారుకోరగా నస్మదాదులము వ్రాసి పంపినట్టు లర్ధమగును. నే నన్న వాస్త వార్ధమును దేవచ్చును. ఇంతే కాక తమకు చిరమిత్రు లయిన శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారిని గూడఁ జెనకిరి ప్రబంధ రత్నావాళిని గూర్చి యకారణముగా వారి కవుల చరిత్ర పీఠిక లోనే మరల నన్నును జెనకిరి. వాని నెల్ల వివరించుట రోఁత నేను జాబుల నిటీవల నేను చింపివేయబోగా తాము జాగ్రత్తగా నంచుకొందుమని నా మిత్రులు గయికొనిరి.

ఇంత యెందుకు వ్రాసితి ననఁగా నాకు వాజ్మయ రంగమున క్రీడా వినోద మనుభవింపవలెనని కొండంతకోరిక చెలరేగుచున్నను, ఆదినుండి కూడ దాని కభ్యంతరములు,ప్రతి షేధములు తఱచుగా నడ్డు దగులుచు నిరుత్సాహము గొల్పుచున్న వని తెల్పుటకు. ఆ నాళ్ళలో ప్రతివాదో త్సాహము నాలో కొంత దూకులాడుచునే యుండెడిది. అయిన నేమి? స్వర్ణ కారుఁడు సువర్ణ జతములను గరఁగించుటకై తనముందు నిప్పులకుంపటిని నడుమ నంగారములు చేర్చి, దాని పై కుండమూకుటిని నెలకొల్పి, కుంపటినిండ నుముక నించి యుంచుకొనును. వలసినప్పు డంగారముల గొట్టముతో నూఁ ది యగ్ని ప్రజ్వలనము కలిగించుకొనును. ఆ యగ్ని కుండమూకుటి మూఁ