పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

మరల ననువదించి ' మి రిఁ క నిట్లు మార్చుకోవలసినదే. తొలుత వ్రాసినదియు సరికా దని స్పష్టపడినది' అనిరి. పంతులుగారు ' నా దగ్గఱ వ్రాఁ త ప్రతి యేదో ఉండు టఁ బట్టియే యట్లు వ్రాయటయ్యెను. రాజమహేంద్రము వెళ్ళి నా దగ్గఱి గ్రంధములఁ బట్టి మరల పర్యలోచించి నిర్ణయింతును' అనిరి. లక్ష్మణ రావుగారు' ఇన్ని పత్రులలో నున్న దానికి విరుద్ధముగా మి వ్రాఁ త ప్రతి యుండదు. ఉండినచో ససిగా సమర్ధముగా మి వాదము నిర్వహించు కోవలసి యుండును 'అనిరి.' పంతులు గారి పట్టుదల పరిభావించుచు వీరేశలింగము గారికి మన మందఱము సహాయము చేయుదము. వారిచేతనే కవుల చరిత్ర సంస్కరణము జరపింతము' అని లక్ష్మణరావుగారు చెప్పిరి.నా చేతనయినంత తోడ్పాటు జరపుదు నంటిని. వా రిర్వురు నింటికి వెళ్ళిరి.

అటనుండి వీరేశలింగము పంతులుగారు బెంగుళూరు కొలఁది దినములకే వెళ్ళిరి. కవుల చరిత్ర ప్రధమ భాగమున మాత్రము చేయవలసిన సంస్కరణములు నే నెఱిఁగినంత బెంగుళూరికి వ్రాసి పంపితిని. అది యొక పెద్దకట్ట పంతులు గారు వాని నుపయోగించుకొనిరి. కాని వాని నా యాపట్టులందు పెర్కొననే లేదు సరికదా! గ్రంధ పీఠికలో- 'శాస్త్రి గారును . . . తమ గ్రంధాలయములో నున్న పుస్తకభాగములను పద్యములను నేను కోరినవానిని వ్రాసి నా కెంతో తోడుపడిరి' అని వ్రాసిరి. వారి కేయే విషయములు కావలసి