పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

ఆఫీసువారు నా మీది నిందును దొరతనము వారికీ తెలుపునంతటి స్థితికి వచ్చెను. ఇంతజరిగిన తర్వాత డొక్కచెదిరి యందాక నాకు ప్రతికూలముగా నున్నవారొకరు లైబ్రరి వ్రాతప్రతులపాఠముల నెల్ల శసిరేఖ పత్రికలొ ప్రకటించిరి. అవి నాప్రకటించిన తీరునే నిరూపించెను. మఱియు కాకినాడలో కార్చెర్ల శ్రీనివాసరావు గా రనువారు పావులూరి గణితపు తాలూకు ప్రతుల సంపాదించి యందలి పాఠములను శ్రీ పోలవరం జమిం దారుగారు, దురిసేటి శేషగిరి రావుగారు వగైరాల సంతకములతో ప్రకటించిరి. అవి యెల్ల నేఁ జెప్పినట్లే యుండెను. అంతతో నా వివాద మడఁ గారెను.

ఒకనాఁడు-" నార్తరన్ సర్కార్సు అసోసియేష౯" మిటింగు (యునివర్సిటీ కాన్వ కేష ౯ తర్వాత )జరుగుచుండఁ గా నే నక్కడి కేగితిని. అచ్చటికి వచ్చియుండిన వీరభద్రరావుగారు నాయెడ వర్తించిన తీరునకు పశ్చాత్తాపము వెల్లడించిరి. మిత్రుల మయితిమి. ఆనాఁ టి సభలో మా పద్యములు పదింటిదాఁ క జదువుటయ్యెను. ఆ యేడే శ్రీ శొంఠి రామమూర్తిగారు గొప్పగా పరీక్షలో కడతేరి యింగ్లండుకు వెళ్ళు యత్నములో నుండిరి. నా పద్య మొకటి-

ఆంధ్రు లత్యంత దేహబలాడ్యు ల నెడు
కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన
ఆంధ్రు లత్యంత బుద్ధిబలాడ్యు ల నెడు
కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన.