పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయసాగిరి. ఇంకెంద రెందఱో అటు తిరిగి నన్ను కటువుగా మందలింప సాగిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారి పేరుప్రతిష్ట లట్టివి గనుక, వారి యాం ధ్రసాహిత్యసేవ యంత మహనీయమయినది గనుక వా రెల్లరు నట్లు ద్రిక్తులయిరి. ఏవో కొన్ని పొరపాట్లుండిన నుండ వచ్చును గాక అని సరిదిద్ద నొల్లకపోయిరి. వారందఱు సత్య మేది యని పరిశీలింపక వ్రాసినవారే. ఒక్క వీరభద్ర రావుగారే సత్యము స్పష్టముగా గుర్తింపఁ దగియున్నను స్పర్దా బుద్ధితో సత్యదూరముగా వ్రాఁత సాగించిరి.

ఆనాళ్ళలో ప్రాచ్యలిఖిత పుస్తక శాలలో మహావీరాచార్యుని గణిత సార సంగ్రహమును ప్రొఫెసరు రంగాచార్యులు గారు ముద్రించుచుండిరి. మల్లన గణితము దానికిఁ దెలుఁ గగుట నేను గుర్తించి రంగాచార్యులుగారి కెఱిఁగించితిని. అప్పుడు వీరభద్రరావుగారి వ్రాఁ తలను గూడ వారికి దెలిపితిని. అప్పుడు మా వివాదము నెల్ల హైకోర్టు కేసురికార్డులను పరిశీలించునట్టు పరిశీలించుచు శ్రీ వేపా రామేశముగారు నావాదము సత్యమయినదని, ప్రతివాదము శ్రుతిమించి యసంబద్ధముగా, సత్య దూరముగా నున్నదని గుర్తించి, నా నౌకరికి కీడు దేఁజూచుచున్న వారి దురుద్రేకమునకు రోసి శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మగారితో నొకనాఁ డు ముచ్చటించిరి. రంగాచార్యులుగారు నా కభయము చెప్పిరి. ట్రాన్ల్సేటరు