పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

౧౪

సాహిత్యజీవనము - అరకుడుపు

నేను మద్రాసు వచ్చిన తర్వాత మైలాపూరులో మా బావగారితో కలసి యే యుంటిని గాని భోజనాదికము పూట కూటియింటి చేయుచుంటిని. ఆనాళ్ళలో మైలాపూరు కపాలీ శ్వరుని గుడిదగ్గఱ రంగమ్మ యను పుణ్యంగన హొటలు పెట్టుకొని యుండెను. ఆమె కొక్కడే కొడుకు. అతడు వ్యర్దుఁడు. ఆయమ్మ భోజనముకు వచ్చు వారికి వారియిండ్లలోకంటె హాయిగా ననుకూలముగా నుండునట్లు వంట చేసి మంచి భోజనము పెట్టెడిది. ఆమె శ్రీ రెంటాల వెంకటసుబ్బారావు గారి దూరపు బంధువు. ఆమె భర్త చాలా శ్రోత్రి యుఁడు, పుణ్యాత్ముఁడు న్నియా సుబ్బారావు గారు చెప్పుచుండెడివారు. ఆమెను శ్రీ సుబ్బారావు గారు కొంతకాల మింట నుంచుకొని పోషించి రఁ ట! కాని వృద్ధురాలు. స్వతంత్ర జీవనార్ధిని యామె యట నుండ నొల్లక వేర్వాసి వచ్చి హొటలు పెట్టినది. ఆమె పుణ్యస్మరణ మిప్పుడు నాకు ముదము గొల్పు చున్నది. నామిఁద నా మెను మాతృ శ్రీనిగా గారవించుచుండెడివారు.కొందఱు హొటలు పెట్టుట నీచవృత్తి యందురు గాని యే వృత్తి యయినను నిర్వంచనముగా ద్రోహము లేకుండ సాగించుచో నది పుణ్యాపాదకమే కాఁగలదు.