పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణరావుగారి మాట విని వెంటనే క్లోరోఫారం ఇచ్చి చేయి సరిదిద్ది కట్టుకట్టెను. మర్నాడట నుండి ధన తృష్ణతో నన్ను పీడింప సాగెను.

వెంటనే మద్రాసు వచ్చి నాకు పరిచితు లయిన డాక్టరు నంజుండ రావుగారికి చూపితిని. వారు ' ఇప్పటికే చేతి సంధిబంములు చాలా శిధిల మయి యున్నవి. డాక్టర్లు కిక చూపవద్దు.ఘ్రుతదధిప్లు తముగా భోజనము చేయుచు జబ్బుకు కొబ్బరి నూనె, వెన్న, నేయి వగైరా స్నేహద్రవ్యములు రాచి, చన్నీటి కొళాయి క్రింది ధారగా నీరు పడునట్లు హెచ్చుసేపు కూర్చుంటి వేని క్రమక్రమముగా చక్కబడగల ' దని చెప్పిరి, అట్లే చేయుచుంటిని, కానీ బోర్డు మిఁద సీమసున్న ముతో నే దేని వ్రాయుటకు రెండవ చేతి తోడ్పాటుతో గాని చేతి నెత్తి పట్టి యుంచ లేక పోవుచుంటిని . మంచినీటి చెంబును కొన్ని గజముల దూరమేని మోసితేఁ జాలకుంటిని. కామక్రమముగా నంజుండ రావుగారు చెప్పినట్టు చేయుచుండుటచే కొంత సుగుణము కలుగుటో, అసౌకర్య సహనమున కలవాటు పడుటో యయ్యెను, కాని యది యేలో నానాఁటికి మనసు నిరుత్సాహగ్రస్తము కాఁజొచ్చెను.

స్వజనము నా స్థితికి వగచుచు ' పెండ్లాడిన తర్వాత వీనిస్థితి వికృతి చెందు చున్నది. ఈ వువాహము వీనికి శుభ ప్రదముగా లేదు' అని పరోక్షముగా,సనసన్నగా ప్రత్యక్ష ముగాను గూడ మాటాడఁ జొచ్చెను. నా కది దుశ్శ్రవ